నూజివీడు సీడ్స్ లిమిటెడ్ సంస్థకు చెందిన ఆద్య పత్తి విత్తనాలతో రైతులు అధిక దిగుబడులు సాధించి, మంచి లాభాలు పొందవచ్చని ఆ సంస్థ రీజినల్ మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. మండలంలోని వెంకట్రావుపేట గ్రామంలో బత్తుల సాయి కుమార్ ఆద్య పత్తి పంట పొలంలో నిర్వహించిన మెగా క్షేత్ర ప్రదర్శన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఆద్య పత్తి విత్తనాలను రూపొందించినట్లు తెలిపారు. ఈ రకం విత్తనాలతో పెద్ద కాయలు, గొలుసుకట్టు కాత, అధిక పూత, ఎక్కువ కాయలతో పాటు ఆరోగ్యవంతమైన పంటను పొందవచ్చని వివరించారు. పంటలో చీడపీడల ప్రభావం తక్కువగా ఉండటంతో పాటు పెట్టుబడి ఖర్చులు తగ్గి, రైతులకు మెరుగైన దిగుబడులు వచ్చే అవకాశం ఉందని అన్నారు.
యాజమాన్య పద్ధతులు
గులాబీ రంగు కాయతొలుచు పురుగు ప్రభావం నుంచి పంటను కాపాడుకునేందుకు తగిన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ, పంటను సకాలంలో కోతకు తీసుకురావడం ద్వారా రైతులు మంచి ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు. ఆద్య పత్తి విత్తనాలు అధిక దిగుబడికి దోహదపడే మంచి రకమని వివరించారు.
ఈ కార్యక్రమంలో నూజివీడు సీడ్స్ క్రాప్ మేనేజర్ సూర్య ప్రకాష్ రెడ్డి, శ్రీరామ ఆగ్రో ఏజెన్సీస్ ప్రొప్రైటర్, నూజివీడు సీడ్స్ డిస్ట్రిబ్యూటర్ అప్పని ప్రశాంత్, కంపెనీ టెరిటరీ మేనేజర్ రాజబాబు, మార్కెట్ డెవలప్మెంట్ ఆఫీసర్లు వేణుగోపాల్, మనోజ్ కుమార్తో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.
మెరుగైన పత్తి విత్తనాలను అందిస్తున్న నూజివీడు సీడ్స్ సంస్థకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.











