ఉట్నూర్, 20 July
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎల్-నినో ప్రభావం వల్ల ఏర్పడే వర్షాభావ పరిస్థితులు, నీటి కొరతను అధిగమించేందుకు ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ, రైతులను ఆదుకుంటామని, వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఖానాపూర్ నియోజకవర్గంలోని ఉట్నూర్ ఐటీడీఏ సమావేశ మందిరంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఎల్-నినో ప్రభావ తీవ్రతను తగ్గించేందుకు ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు మాట్లాడుతూ, ఎల్-నినో వల్ల ఏర్పడిన వర్షాభావ పరిస్థితులను అధిగమించి రైతులను ఆదుకుని అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఎల్-నినో ప్రభావంతో ఏర్పడే నీటి కొరత, రైతుల ప్రయోజనాలను ఎలా కాపాడాలనే అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు. నీటి కొరత, పంటలపై రైతులను చైతన్యం చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఆయన అన్నారు. మున్సిపాలిటీల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కూడా ఆయన కోరారు. పార్టీలకు అతీతంగా రైతులకు అందరూ సహకరించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్పెషల్ ఆఫీసర్ కె. ఇళంబరితి గారు, ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బోజ్జు పటేల్ గారు, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.












