Madanapalle/Pedda Thippasamudram (అక్షరవేకువ) జూలై 19
రైతులంకషేమం,వారఆదాయంెంచడమేారమరరొడయూరకంెన(రధానలకషయమనంథలహారదారుడుగోనెశయాంుందరరావుఅననారుశనవారంహాజూరమండలకేందరంలోనరవహంచనహాజూరఏడోవారషకరవభయమావేశంలోఆయనాలగొనమాటలాడారుఏడేళలుగారైతులంకషేమం,ఆదాయంెంుకోంకృషచేతుననామనతెలారు
రైతుల శ్రేయస్సు, వారి ఆదాయం పెంచడమే ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ ( ఎఫ్ పీ సీ ) ప్రధాన లక్ష్యమని సంస్థ సలహారదారుడు గోనె శ్యాంసుందర్రావు అన్నారు. శనివారం హాజీపూర్ మండల కేంద్రంలో నిర్వహించిన హాజీపూర్ ఎఫ్.పి.సి ఏడో వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఏడేళ్లుగా రైతుల సంక్షేమం, ఆదాయం పెంపు కోసం కృషి చేస్తున్నామని తెలిపారు.
అంతకుముందు, ఎఫ్.పి.సి ఆదాయ వ్యయాలకు సంబంధించిన నివేదికను సభ్యుల సమావేశంలో చదివి వినిపించారు. హాజీపూర్ ఎఫ్.పి.సి కోసం భవనం నిర్మించేందుకు నం నూరుకు చెందిన కారుకూరి చంద్రమౌళి ఐదుగుంటల భూమిని విరాళంగా ఇచ్చినందుకు ఆయనను ఎఫ్.పి.సి సభ్యులు సన్మానించారు.
ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు పుష్కరి శ్రీనివాస్ రావు, బొడ్డు శంకర్, బొలిశెట్టి తిరుపతి, గోన సతీష్ రావు, మోటపలుకుల తిరుపతి, ఒడ్డే బాలరాజ్, సింగతి మురళి, రవీందర్ రెడ్డి, బొడ్డు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.












