మంచిర్యాల (అక్షరవేకువ) ఆగస్టు 03
మంచిర్యాల జిల్లాలో పట్టూర్పూర్రూర్గూర్ల రైతూర్లపై ఫారెస్ట్ అధికావర కొత్త పెళ్లిలోరూర్లూర్ దాడూర్లూర్ తీవ్రతరం చేయడంతో రైతూర్లూర్ ఆందోళన చెన్నూర్ కోటపల్లి మండలం కావరకూర్ దిగారూర్. చెన్నూర్ూర్ నియోజకవర్గ పరిధిలోని కోటపల్లిటపల్లి మండలం కావరవర కొత్తపల్లి గ్రామంలో 20 ఏళ్లూర్గా పట్టూర్పూర్రూర్గూర్ల పెంపకంపై ఆధారపడి జీవనం సాగిస్తూర్న్న 170 కూర్టూర్ంబాల జీవనోపాధికి ఈ దాడూర్లూర్ తీవ్ర నష్టం కలిగిస్తూర్న్నాయని రైతూర్లూర్ వాపోతూర్న్నారూర్.
మంచిర్యాల జిల్లాలో పట్టుపురుగుల రైతులపై ఫారెస్ట్ అధికారులు దాడులు తీవ్రతరం చేయడంతో రైతులు ఆందోళనకు దిగారు. చెన్నూర్ నియోజకవర్గ పరిధిలోని కోటపల్లి మండలం కావర కొత్తపల్లి గ్రామంలో 20 ఏళ్లుగా పట్టుపురుగుల పెంపకంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న 170 కుటుంబాల జీవనోపాధికి ఈ దాడులు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని రైతులు వాపోతున్నారు. ఫారెస్ట్ అధికారులు చెట్లను నరికివేయడం, పట్టుపురుగుల కొమ్మలను కొట్టివేయడంతో రైతులు లబోదిబోమంటున్నారు.
అధికారుల తీరుపై ఆగ్రహం
ఫారెస్ట్ అధికారులు తమ భూముల్లోకి చొరబడి చెట్లను కొట్టివేస్తూ, పట్టుపురుగుల పెంపకానికి అవసరమైన కొమ్మలను నరికివేయడం దారుణమని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ దాడుల వల్ల తమకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని, జీవనోపాధి దెబ్బతింటోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫారెస్ట్ అధికారుల దమనకాండపై చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ప్రజాప్రతినిధుల జోక్యం కోరుతూ
ఈ విషయంలో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి రైతు కుటుంబాలకు న్యాయం చేయాలని రైతు సంఘాలు కోరుతున్నాయి. మంత్రి వివేక్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లగా, ఆయన జోక్యం చేసుకుని ఫారెస్ట్ అధికారులకు సూచనలు చేసినా వారి మొండివైఖరి మారడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. యధాతథంగా దాడులు కొనసాగుతున్నాయని, తమకు న్యాయం జరిగే వరకు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు.












