బజార్ మండలం చందునాయక్ తాండ లో మథుర లబానా సమాజ్ ఆధ్వర్యంలో జరిగిన ఋషి పంచమి కార్యక్రమానికి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయ్యారు. గ్రామస్తులు, సర్పంచ్ ఆయనకు ఘనంగా సన్మానించి స్వాగతం పలికారు.
అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే, దేవి సింగ్ మహారాజ్, ప్రేమ్ సింగ్ మహారాజ్ లను శాలువాతో సన్మానించి వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ ఋషి పంచమి వేడుకల్లో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తో పాటు స్థానిక కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సమాజ అభివృద్ధికి, సంప్రదాయాల పరిరక్షణకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.











