భారత జనగణన 2027 కార్యక్రమం, 11.05.2026 నుండి 09.06.2026 వరకు, మందమర్రి పట్టణంలో ప్రారంభమైంది.
మండలంలోని 24 వార్డుల పరిధిలో 75 మంది ఎన్యూమరేటర్లు మరియు 13 మంది సూపర్వైజర్లు ఇంటింటికి వెళ్లి సమాచారాన్ని సేకరిస్తారు. మున్సిపల్ కమిషనర్ టి. రాజ లింగు ఈ కార్యక్రమం గురించి సమాచారం ఇచ్చారు.
ప్రజలకు విజ్ఞప్తి: జనగణన సిబ్బంది కేవలం ఇండ్ల జాబితా మరియు గృహ వివరాలకు సంబంధించిన 33+1 ప్రశ్నలను మాత్రమే అడుగుతారు. ఇతర వ్యక్తిగత రహస్య సమాచారాన్ని అడగరు.
ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు అధికారిక జనగణన గుర్తింపు కార్డులను చూపిస్తారు. ప్రజలు ఎలాంటి అప్రమత్తతతో ఉండాలని కమిషనర్ సూచించారు.











