బుద్దిపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక గ్రామ సభ 10 జూన్ 2026న నిర్వహించబడింది. ఈ సభకు దుర్గం సంధ్య సర్పంచ్ అధ్యక్షత వహించారు.
సభలో ప్రత్యేక అధికారి అగ్రికల్చర్ AO కృష్ణ మరియు అగ్రికల్చర్ AD మ్. కృష్ణ పాల్గొన్నారు. వారు గ్రామాభివృద్ధి సంబంధిత అంశాలపై చర్చించారు.
పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, పంటల వైవిధ్యీకరణ, మొక్కల నాటడం, ఓటరు జాబితా సవరణ, ఘన వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది.
గ్రామ ప్రజలు, వార్డు సభ్యులు మరియు మండల గ్రామ స్థాయి అధికారులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
వ్యవసాయ అధికారి మాట్లాడుతూ, వరి సన్న రకాలు సాగు చేయాలని, వరి కొయ్యలు కాల్చవద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు.










