మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువజన నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేశారు.
యువజన కాంగ్రెస్ హుస్నాబాద్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి ఎర్రోళ్ల చైతన్య మాట్లాడుతూ, ప్రజాసేవలో రక్తదానం అత్యంత గొప్ప సేవ అని, ఒకరి ప్రాణాలను కాపాడే గొప్ప కార్యం అని పేర్కొన్నారు.
సమాజంలో ప్రతి ఒక్కరూ రక్తదానం పట్ల అవగాహన పెంచుకోవాలని, అవసరమైనప్పుడు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. రక్తదానం ద్వారా ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపవచ్చని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా రక్తదానం చేసి, తమ సామాజిక బాధ్యతను నిర్వర్తించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన వారందరినీ అభినందించారు.












