మంచిర్యాల (అక్షరవేకువ) ఆగస్టు 14
తెణషటభుతతషటతకటటథకకుసకొషధబధుుీటటకక,టటుూతసుకుతసకుసకొషీధుకుైూతభు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 10వ డివిజన్లో లబ్ధిదారులు శీలం గట్టక్క, గట్టయ్య గార్లు పూర్తి చేసుకున్న గృహ ప్రవేశ మహోత్సవానికి మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ దర్ని మధుకర్ గారు హాజరై నూతన గృహాన్ని ప్రారంభించారు.
మేయర్ శుభాకాంక్షలు
ఈ సందర్భంగా మేయర్ గారు లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. గృహ ప్రవేశానికి విచ్చేసిన మేయర్ గారిని, స్థానిక కార్పొరేటర్ గారిని లబ్ధిదారులు మర్యాదపూర్వకంగా శాలువాతో సన్మానించారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో మేయర్ గారితో పాటు స్థానిక కార్పొరేటర్ శ్రీ రాచకొండ గోపాల్ రావు, హౌసింగ్ బోర్డు అధికారులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.











