ఆటో రిక్షా వెల్ఫేర్ అసోసియేషన్ (ARWA) మంచిర్యాల పట్టణ అధ్యక్షులు కీర్తిశేషులు అంకతి సత్తయ్య గారి ఆకస్మిక మృతి పట్ల ఆటో సంఘం సభ్యులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, నివాళులర్పించారు.
ఇటీవల గుండెపోటుతో మరణించిన ARWA మంచిర్యాల పట్టణ అధ్యక్షులు అంకతి సత్తయ్య గారికి, అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు తూముల నరేష్ అన్న గారి ఆధ్వర్యంలో సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. సత్తయ్య గారి నివాసానికి వెళ్ళిన సంఘం నాయకులు, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మంచిర్యాల బస్టాండ్ ఆటో పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన సత్తయ్య గారి చిత్రపటానికి పూలమాలలు వేసి, సభ్యులు ఆయన సేవలను స్మరించుకున్నారు. ఆటో కార్మికుల హక్కుల కోసం, వారి సంక్షేమం కోసం సత్తయ్య గారు చేసిన కృషిని ఈ సందర్భంగా కొనియాడారు.
ఆయన జ్ఞాపకార్థం, ఆటో డ్రైవర్లు, యూనియన్ నాయకులు కలిసి కాండిల్ ర్యాలీని నిర్వహించారు. సత్తయ్య గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వారి మరణం ఆటో కుటుంబానికి తీరని లోటు అని సభ్యులు పేర్కొన్నారు.
ఈ సంతాప కార్యక్రమంలో కార్పొరేటర్ GVR, కుమ్మరి సంఘం జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి రమేష్, మోహన్, కదీర్, మరియు పలువురు ఆటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.












