మంచిర్యాల నియోజకవర్గంలో ఒక పేద కుటుంబానికి మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అండగా నిలిచారు. ఆరోగ్య ఖర్చుల నిమిత్తం రూ. 7,00,000 లక్షల విలువైన LOC చెక్కును ఆ కుటుంబానికి అందజేశారు.
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 32వ డివిజన్ కు చెందిన హర్షిత్ ప్రిన్స్ అనే యువకుడి కుటుంబం ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల నేపథ్యంలో ఈ సహాయం అందించబడింది.
మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, టీపీసీసీ సభ్యులు నూకల రమేష్ లు ఈ చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ ఆర్థిక సహాయం తమకు ఎంతో ఉపశమనాన్ని ఇచ్చిందని, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, శ్రీమతి కొక్కిరాల సురేఖలకు తాము ఎప్పటికీ రుణపడి ఉంటామని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సంఘటన స్థానిక సమాజంలో సామాజిక బాధ్యతకు నిదర్శనంగా నిలిచింది.












