మంచిర్యాలలోని పద్మనాయక ఏసీ ఫంక్షన్ హాల్ లో లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సీనియర్ నర్సింగ్ అధికారులకు ఘనంగా సన్మాన కార్యక్రమం జరిగింది. హాస్పటల్ సూపర్నెంట్ డాక్టర్ వేద వ్యాస్, ఆర్.ఎం.ఓ. డాక్టర్ శ్రీమన్నారాయణ, అసిస్టెంట్ సూపర్డెంట్ డాక్టర్ శ్రీధర్, మరియు ఆసుపత్రి సిబ్బంది సమక్షంలో ఈ సన్మానం జరిగింది.
లైన్స్ క్లబ్ మంచిర్యాల సీనియర్ లైన్ మెంబర్ ప్రోగ్రాం చైర్పర్సన్ లయన్ వి. మధుసూదన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో, జీజీహెచ్ డిప్యూటీ నర్సింగ్ సూపర్డెంట్లు శ్రీమతి ఇన్నమ్మ, శ్రీమతి సిపి. విజయలక్ష్మి, ఎం.సి.హెచ్. డిప్యూటీ నర్సింగ్ సూపర్డెంట్లు శ్రీమతి ఎన్. రాజమణి, శ్రీమతి ఎండి. సోఫియా సుల్తానా, మరియు 16 మంది సీనియర్ నర్సింగ్ ఆఫీసర్లు సన్మానం అందుకున్నారు.
వారికి శాలువాలు కప్పి, లైన్స్ ఆర్గనైజేషన్ నుండి ప్రశంసా పత్రాలు, సోనీ జువెలరీ షాప్ అందించిన బహుమతులను అందజేశారు. నర్సింగ్ వృత్తిలో వారి నిబద్ధత, సేవలను అభినందించారు.
ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ మంచిర్యాల అధ్యక్షులు లయన్ కారుకూరి చంద్రమౌళి, ప్రోగ్రాం చైర్పర్సన్ లయన్ వి. మధుసూదన్ రెడ్డి, లయన్ చందోరి మహేందర్ పాల్గొన్నారు. దాదాపు 200 మంది మహిళలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.












