సంగారెడ్డి, 2026-08-24
ప్రజల సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఫిర్యాదుదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు.
ప్రజల సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్పీ వారితో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలను ఓపికగా విన్నారు.
సంబంధిత ఎస్హెచ్ఓలతో ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య జాప్యానికి గల కారణాలను తెలుసుకున్నారు. ప్రతి ఫిర్యాదును నిష్పక్షపాతంగా విచారణ జరిపి, బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, స్థానిక పోలీస్ స్టేషన్లో తమ సమస్యకు పరిష్కారం లభించని పక్షంలో ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటికి చట్టపరమైన పరిష్కారం అందించడమే ప్రజావాణి కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని ఎస్పీ తెలిపారు.


