మంచిర్యాల (అక్షరవేకువ) జూలై 17
మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఈ నెల 19వ తేదీన తొలిసారిగా కాళీమాత బోనాల జాతర ఘనంగా నిర్వహించనున్నట్లు శ్రీ కాళీమాత అష్ట కాలభైరవ గణపతి దేవాలయం అఘోరి గురు రఘు స్వామి తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల వేడుకకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలో తొలిసారిగా కాళీమాత బోనాలను నిర్వహిస్తున్నట్లు శ్రీ కాళీమాత అష్ట కాలభైరవ గణపతి దేవాలయం అఘోరి గురు రఘు స్వామి తెలిపారు. శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు బోనాలు గుర్తింపు తెస్తాయని అన్నారు.
గోపాల్ వాడ హనుమాన్ ఆలయం నుండి కుమ్మర సంఘం ఆధ్వర్యంలో కాళీమాత ఆలయం వరకు బోనాల వేడుక నిర్వహించబడుతుందని తెలిపారు. 56వ డివిజన్ కార్పొరేటర్ నల్ల శంకర్ ఇంటి నుండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన పలహార బండితో శోభాయాత్ర జరుగుతుందన్నారు. హైదరాబాద్ నుండి పోతురాజులు కూడా ఈ శోభాయాత్రలో పాల్గొంటారని పేర్కొన్నారు.
మంచిర్యాల పరిసర ప్రాంత భక్తులు, మహిళలు బోనాలతో తరలివచ్చి అమ్మవారి దీవెనలు పొందాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్, కార్పొరేటర్లు నల్ల శంకర్, శ్రీపతి వాసు, ఆలయ కమిటీ సభ్యులు పెట్టేం తిరుపతి, ఆర్కల విజయ పలువురు పాల్గొన్నారు.












