వినాయక నిమజ్జనం సందర్భంగా జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) మల్లారెడ్డి సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లోని చెరువులు, కుంటల వద్ద ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు.
జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) మల్లారెడ్డి గురువారం మాట్లాడుతూ, వినాయక నిమజ్జనం జరిగే చెరువులు, కుంటలు, ఇతర నీటి వనరుల వద్ద ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నిమజ్జన ప్రాంతాలను ముందుగానే పరిశీలించి, ప్రమాదకరంగా ఉన్న ప్రదేశాలను గుర్తించాలని సూచించారు. లోతైన ప్రాంతాల్లో ప్రజలు, చిన్నారులు నీటిలోకి వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తెలిపారు. డీఎల్పీఓలు, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులు తమ పరిధిలోని గ్రామాలను సందర్శించి నిమజ్జన ఏర్పాట్లను పర్యవేక్షించాలని డీపీవో మల్లారెడ్డి ఆదేశించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టి, నిమజ్జనం అనంతరం చెరువులు, కుంటల పరిసరాలను శుభ్రం చేయాలని సూచించారు. ప్రజలు కూడా అధికారుల సూచనలు పాటిస్తూ అప్రమత్తంగా వ్యవహరించి, నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు సహకరించాలని ఆయన కోరారు.











