జిల్లా శాంతాపూర్ గ్రామంలోని రామ్ మందిర్ లో శ్రీ సంత్ బ్రహ్మలింగ సదానంద్ మహారాజ్ 20వ పుణ్యతిథి కార్యక్రమం ఈ నెల 20వ తేదీ శుక్రవారం నాడు జరగనుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు పిలుపునిచ్చారు.
జిల్లా శాంతాపూర్ గ్రామంలోని రామ్ మందిర్ లో ఈ నెల 20వ తేదీ శుక్రవారం నాడు శ్రీ సంత్ హ. భ. ప. బ్రహ్మలింగ సదానంద్ మహారాజ్ 20వ పుణ్యతిథి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు. ఈ సందర్భంగా అన్నదానం కార్యక్రమం కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తులందరు మధ్యాహ్నం 1:00 గంటలకు రామ్ మందిర్ కు చేరుకోవాలని సూచించారు. గులాల్ కార్యక్రమం కూడా ఉంటుందని, అందరూ సకాలంలో రావాలని కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ సంత్ సదన్ హ. భ. ప. నారాయణ్ మహారాజ్ విచ్చేస్తున్నారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.












