సంగారెడ్డి, 14 October
31, 11వ వార్డుల్లో రూ.80 లక్షలతో సీసీ రోడ్డు పనులు ప్రారంభం మున్సిపాలిటీ పరిధిలోని 31వ, సుమారు లక్షల వ్యయంతో చేపట్టనున్న పనులను మున్సిపల్ చైర్మన్ కూన వనిత సంతోష్ ప్రారంభించారు. పట్టణ అభివృద్ధిలో మరో ముందడుగు అని పేర్కొన్నారు.
సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 31వ, 11వ వార్డుల్లో సుమారు రూ.80 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులను మున్సిపల్ చైర్మన్ కూన వనిత సంతోష్ ప్రారంభించారు. ముఖ్య అతిథి నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ, సంగారెడ్డి పట్టణంలోని అన్ని వార్డులు అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నాయని అన్నారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని, ప్రజల అవసరాలను గుర్తించి పనిచేస్తున్న మున్సిపల్ చైర్మన్ కూన వనిత సంతోష్తో పాటు పాలకవర్గాన్ని అభినందించారు. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ కూన వనిత సంతోష్ మాట్లాడుతూ, సంగారెడ్డి పట్టణంలో ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు సతీశ్ రెడ్డి, దశరథ్ రెడ్డి, శ్రీకాంత్ గౌడ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కిరణ్ గౌడ్, నాయకులు కూన సంతోష్, తులసిరామ్, శ్రీశైలం, అన్వర్, రామచందర్ గౌడ్, జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.











