ఆదిలాబాద్, 19 November
జిల్లా భీంపూర్ మండలంలో దారుణం చోటుచేసుకుంది. మేనమామ అయిన మడావి కృష్ణ (26) ఐదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మాయమాటలు చెప్పి తీసుకెళ్లి ఈ ఘోరానికి ఒడిగట్టాడు. బాలిక తల్లి ఫిర్యాదుతో నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండు విధించారు.
జిల్లా భీంపూర్ మండలానికి చెందిన మడావి కృష్ణ (26) తన మేనమామ ఇంటికి వచ్చి, మంగళవారం ఇంటి సమీపంలో ఉన్న ఐదేళ్ల చిన్నారికి మాయమాటలు చెప్పి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఏడుస్తూ ఇంటికి వచ్చిన చిన్నారి తన తల్లికి విషయం చెప్పడంతో ఫిర్యాదు చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా రిమాండు విధించినట్లు డీఎస్పీ తెలిపారు.


