హైదరాబాద్ రాంనగర్ లో కొత్త కారు అదుపుతప్పి ద్విచక్ర వాహనాలు, కూరగాయల బండిని ఢీకొని మెడికల్ షాపులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కూరగాయలు అమ్ముతున్న మహిళకు గాయాలయ్యాయి.
హైదరాబాద్లోని రాంనగర్ ప్రాంతంలో కొత్తగా కొనుగోలు చేసిన కారు అదుపుతప్పి బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలను, కూరగాయల బండిని ఢీకొని సమీపంలోని మెడికల్ షాపులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కూరగాయలు విక్రయిస్తున్న మహిళ తీవ్రంగా గాయపడింది. ప్రమాదం జరిగిన సమయంలో మెడికల్ షాపు మూసి ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న ముషీరాబాద్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కారు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందా లేక సాంకేతిక లోపం వల్ల జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.


