తమిళనాడు రాజకీయాల్లో విషాదం నెలకొంది. కొలత్తూరు నియోజకవర్గం నుంచి మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌ను ఓడించి సంచలనం సృష్టించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) ఎమ్మెల్యే వీఎస్ బాబు (75) కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వీఎస్ బాబు సుమారు 70 రోజులుగా ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం క్షీణించడంతో మధ్యాహ్నం 2.24 గంటలకు గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో కొలత్తూరు నుంచి పోటీ చేసిన వీఎస్ బాబు, డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్‌పై 8,795 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయన 82,997 ఓట్లు సాధించారు. గతంలో డీఎంకే పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన బాబు, 2016లో అన్నాడీఎంకేలో చేరారు. ఆ తర్వాత 2021లో తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీలో చేరి రాజకీయాల్లో కొనసాగారు. వీఎస్ బాబు మరణంతో తమిళనాడు అసెంబ్లీలో ఖాళీ అయిన స్థానాల సంఖ్య ఆరుకు చేరింది. ఆయన ఆకస్మిక మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపారు.


