అమెజాన్ అనుబంధ సంస్థ జూక్స్ రూపొందించిన డ్రైవర్‌లెస్ రోబోట్యాక్సీలు ఇప్పుడు ఉబర్ యాప్‌లో అందుబాటులోకి వచ్చాయి. అమెరికాలోని లాస్వేగాస్లో ఈ సేవలను ప్రారంభించారు. ప్రయాణికులకు అదనపు ఛార్జీలు లేకుండా ఈ సేవలు లభించనున్నాయి.
అమెరికాకు చెందిన అమెజాన్ అనుబంధ సంస్థ జూక్స్ రూపొందించిన డ్రైవర్‌లెస్ రోబోట్యాక్సీలు ఇప్పుడు ఉబర్ యాప్‌లో అందుబాటులోకి వచ్చాయి. అమెరికాలోని లాస్వేగాస్లో ఈ సేవలను ప్రారంభించారు. ఉబర్ఎక్స్, ఉబర్ కంఫర్ట్, ఉబర్ ఎలక్ట్రిక్, వెయిట్ అండ్ సేవ్ వంటి రైడ్లను బుక్ చేసుకునే ప్రయాణికులకు, అందుబాటులో ఉన్న వాహనాన్ని బట్టి జూక్స్ రోబోట్యాక్సీ కేటాయించే అవకాశం ఉంది. దీనికోసం అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఉబర్ యాప్‌లోని రైడ్ ప్రిఫరెన్సెస్ సెట్టింగ్స్‌లో ఆటోనమస్ రైడ్స్‌ను ఎంచుకుంటే, ఈ వాహనం లభించే అవకాశాలు పెరుగుతాయి. ఈ ప్రత్యేక ఎలక్ట్రిక్ వాహనంలో స్టీరింగ్ వీల్, డ్రైవర్ సీటు ఉండవు. ప్రయాణికులు ఒకరికొకరు ఎదురెదురుగా కూర్చునేలా సీట్లను రూపొందించారు. లాస్‌వేగాస్‌లోని స్ట్రిప్ ప్రాంతం, డౌన్‌టౌన్, ఆర్ట్స్ డిస్ట్రిక్ట్‌లలో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. ఉబర్, జూక్స్ సంస్థలు ఎంజీఎం రిసార్ట్స్‌తో బహుళ సంవత్సరాల భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. 2027లో లాస్ఏంజెలెస్లోనూ ఉబర్ ద్వారా ఈ సేవలను విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించాయి.


