అరెపల్లీ గ్రామంలో ఈరోజు ఉదయం 9:30 గంటలకు ప్రజా పాలన ముగింపు ప్రత్యేక గ్రామసభ నిర్వహించబడింది.
ఈ సమావేశంలో గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సర్పంచ్ శ్రీ ఆకుదారి వీరయ్యగారు అధ్యక్షత వహించారు.
సభలో ఓటర్ లిస్టు స్పెషల్ రివిజనల్ పై చర్చ జరిగింది. 18 ఏళ్లు నిండిన కొత్త ఓటర్ల పేరు చేర్పించుకోవాలని మరియు చనిపోయిన వారి పేర్లను డిలీట్ చేయాలని తెలియజేయడం జరిగింది.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, ఇంట్లో నాలుగు రకాల చెత్త డబ్బాలను ఏర్పాటు చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ది అధికారి మధుసూదన్, MPO సతీష్ రెడ్డి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.












