చెన్నూర్ సాయిరాం ఫంక్షన్ హాల్లో ఈ నెల 22వ తేదీ మంగళవారం నిర్వహించనున్న ఉచిత నేత్ర వైద్య చికిత్స శిబిరానికి సంబంధించిన వాల్ పోస్టర్ను శుక్రవారం కోటపల్లి పోలీస్ స్టేషన్లో సీఐ ఆర్ కృష్ణ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు లయన్స్ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు.
చెన్నూర్ సాయిరాం ఫంక్షన్ హాల్లో ఈ నెల 22వ తేదీ మంగళవారం నిర్వహించనున్న ఉచిత నేత్ర వైద్య చికిత్స శిబిరానికి సంబంధించిన వాల్ పోస్టర్ను శుక్రవారం కోటపల్లి పోలీస్ స్టేషన్లో సీఐ ఆర్ కృష్ణ చేతుల మీదుగా ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో జోన్ చైర్పర్సన్ లయన్ జాడి తిరుపతి, లయన్స్ క్లబ్ ఆఫ్ చెన్నూర్ అధ్యక్షుడు లయన్ నిమ్మల సాగర్, లయన్ నిమ్మల విశాల, లయన్ పప్పిరెడ్డి దీక్షిత్ తదితరులు పాల్గొన్నారు.
పోలీసుల మద్దతు
ఈ సందర్భంగా సీఐ ఆర్ కృష్ణ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆఫ్ చెన్నూర్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. ప్రజలకు అవసరమైన సమయంలో సేవలు అందిస్తూ లయన్స్ క్లబ్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. లయన్స్ క్లబ్ చేపట్టే సేవా కార్యక్రమాలకు పోలీస్ శాఖ తరఫున పూర్తి మద్దతు, సహకారం అందిస్తామని తెలిపారు.
కంటి చూపు సమస్యలతో బాధపడుతున్న వారికి వైద్య సహాయం అందించాలనే లక్ష్యంతో ఈ ఉచిత నేత్ర వైద్య చికిత్స శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు లయన్స్ క్లబ్ ప్రతినిధులు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.












