తెలంగాణలో మంచిర్యాల జిల్లాకు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు (పీఎస్ఆర్) తనదైన ముద్ర వేశారని, రైతులు, సింగరేణి కార్మికులు, అన్ని వర్గాల సమస్యలపై దృష్టి సారించి, వాటి సాధన దిశగా కార్యచరణ సాగుతున్నట్లు పలువురు పేర్కొంటున్నారు. లక్షట్ పేట్ ఆసుపత్రి నిర్మాణ ఫోటోలు రాష్ట్ర ఫ్లెక్సీలతో పాటు పాఠ్య పుస్తకాలలో ముద్రణ కావడం ఎమ్మెల్యే దూరదృష్టికి అందుతున్న ప్రశంస అని పలువురు అభివర్ణిస్తున్నారు.
తెలంగాణలో మంచిర్యాల జిల్లాకు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు (పీఎస్ఆర్) తనదైన ముద్ర వేశారని, రైతులు, సింగరేణి కార్మికులు, అన్ని వర్గాల సమస్యలపై దృష్టి సారించి, వాటి సాధన దిశగా కార్యచరణ సాగుతున్నట్లు పలువురు పేర్కొంటున్నారు. లక్షట్ పేట్ ఆసుపత్రి నిర్మాణ ఫోటోలు రాష్ట్ర ఫ్లెక్సీలతో పాటు పాఠ్య పుస్తకాలలో ముద్రణ కావడం ఎమ్మెల్యే దూరదృష్టికి అందుతున్న ప్రశంస అని పలువురు అభివర్ణిస్తున్నారు.
గత 10 ఏళ్ల పాలనలో కాని అభివృద్ధిని కేవలం 3 డేళ్లలో చేసి చూపిన మహానేత అని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. 11 కోట్లతో మహాప్రస్థానం, 650 కోట్లతో 7 అంతస్తుల జనరల్ హాస్పిటల్, మాతా శిశు సంక్షేమ ఆస్పత్రి అనుసంధానంగా 78 కోట్లతో అండర్ గ్రౌండ్ విద్యుత్, డ్రైనేజ్ ఆధునీకరణ పనులతో ప్రజల మెప్పు పొందుతున్నారని తెలిపారు. 57, 58, 59 కార్పొరేషన్ డివిజన్లలో ఈ పనులు శరవేగంగా సాగుతున్నాయని, పూర్తయితే మంచిర్యాలకు కొత్త రూపు సంతరించుకుంటుందని పేర్కొన్నారు.
అలాగే విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తూ, పథకాల రూపకల్పనతో విద్యార్థులకు మెరుగైన విద్య అందించే లక్ష్యంతో పలు కార్యక్రమాలను ఎమ్మెల్యే చేపట్టినట్లు అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
ఎమ్మెల్యే పీఎస్ఆర్ రాజకీయ ప్రస్థానం
మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు 68వ జన్మదిన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం. గతంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత నమ్మకస్తుడిగా ముద్రపడ్డ పీఎస్ఆర్, ఆదిలాబాద్ రాజకీయాల్లో తనదైన గుర్తింపు చాటారు. 21 జడ్పిటిసిలను కాంగ్రెస్‌లో జిల్లా రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. తదుపరి కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీగా కొనసాగుతూ, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనకు ఎదురు నిలబడి, కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవడంలో కీలకపాత్ర పోషించారు.
ఇంద్రవెల్లిలో పీపుల్స్ మార్చుతోపాటు, మంచిర్యాల కాలేజీ గ్రౌండ్లో మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో జరిగిన భారీ బహిరంగ సభ, ప్రస్తుత డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పాదయాత్రను సక్సెస్‌ఫుల్‌గా ప్రేమ్ సాగర్ రావు సహాయంతో విజయవంతం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్‌తో ఆయనకు అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి.
మూడేళ్ల కింద అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవిపై దోబూచులాట సాగినప్పటికీ, చివరికి ఎమ్మెల్యేగానే కొనసాగుతూ అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం వందల కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతోంది. మరో రెండేళ్ల పాలన సమయం ఉన్నందున మంచిర్యాల అభివృద్ధితో పాటు ప్రజల సంక్షేమంపై దృష్టి సాధించాలని మంచిర్యాల అసెంబ్లీ ప్రజలు కోరుకుంటున్నారు.

