టీయుడబ్ల్యూజే - ఐజేయు జిల్లా అధ్యక్షుడు, సీనియర్ జర్నలిస్టు బండారు యాదగిరి జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. జన్మదినాన్ని పురస్కరించుకుని రక్తదాన కార్యక్రమం కూడా నిర్వహించారు.
టీయుడబ్ల్యూజే - ఐజేయు జిల్లా అధ్యక్షుడు, సీనియర్ జర్నలిస్టు బండారు యాదగిరి జన్మదిన వేడుకలు మంగళవారం జర్నలిస్టులు, మిత్రులు, శ్రేయోభిలాషుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన రక్తదాన కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు, రక్తదాతలు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. సామాజిక సేవకు ప్రాధాన్యతనిస్తూ రక్తదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు దొంతి మహేష్ గౌడ్, డి.శ్రీకాంత్, బండారు రాజు, నవీన్ కుమార్ తో పాటు పటాన్చెరు ప్రాంత జర్నలిస్టులు, టీయుడబ్ల్యూజే- ఐజేయు ప్రతినిధులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, రక్తదాతలు పాల్గొన్నారు.











