జిల్లా కేంద్రంలోని టూ టౌన్ కు ముఖద్వారమైన అండర్ బ్రిడ్జి వద్ద సోమవారం ఉదయం పాము కలకలం రేపింది. బ్రిడ్జికి ఇరువైపులా రోడ్డుపైకి వ్యాపించిన తుమ్మ చెట్లు, తీగ పొదల కారణంగా జారుకున్న త్రాచు పాము రోడ్డుపై పడి ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేసింది.
జిల్లా కేంద్రంలోని టూ టౌన్ కు ప్రధాన మార్గమైన అండర్ బ్రిడ్జి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. బ్రిడ్జికి ఎడమవైపు తుమ్మ చెట్లు, తీగ పొదలు రోడ్డుపైకి విస్తరించాయి. ఈ పొదల నుంచి జారుకున్న పొడవైన త్రాచు పాము రోడ్డుపై పడింది. వాహనాల రాకపోకలకు అడ్డుగా రోడ్డుపైనే కొంతసేపు ఉండటంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తరచుగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని, అధికారులు వెంటనే స్పందించి రోడ్డుపైకి వ్యాపించిన తుమ్మ చెట్లను, తీగ పొదలను తొలగించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు ఈ సమస్యపై దృష్టి సారించి శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.












