మంచిర్యాల పట్టణంలోని గోదావరి రోడ్లో ఉన్న ఏకలవ్య ఆశ్రమ సేవా భారతిలో ఉచిత ఎస్సై శిక్షణ శిబిరంలో జాతీయ స్వచ్ఛంద రక్తదాతల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు రక్తదానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320 జి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ లయన్ వి. మధుసూదన్ రెడ్డిసూదన్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320 జి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఫర్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ లయన్ వి. మధుసూదన్ రెడ్డిసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో, ఏకలవ్య ఆశ్రమ సేవా భారతి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఉచిత ఎస్సై శిక్షణ శిబిరంలో జాతీయ స్వచ్ఛంద రక్తదాతల దినోత్సవం పురస్కరించుకొని విద్యార్థినీ విద్యార్థులకు రక్తదానంపై అవగాహన కల్పించారు. రక్తదాన శిబిరంలో పాల్గొనవలసిందిగా వారిని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా రక్తదానంపై అవగాహన కల్పించడానికి, పూర్తి సమాచారంతో తయారుచేసిన కరపత్రాలను విడుదల చేసి, విద్యార్థులకు అందజేశారు. విద్యార్థులు ఈ కార్యక్రమానికి సానుకూలంగా స్పందించారు.
ఈ సందర్భంగా లయన్ వి. మధుసూదన్ రెడ్డిసూదన్ రెడ్డి మాట్లాడుతూ, అన్ని దానాల కన్నా రక్తదానం అత్యంత ముఖ్యమైనదని, పవిత్రమైనదని, మనిషి ప్రాణాలను కాపాడే అమూల్యమైన ఔషధమని అన్నారు. యువత ముందుకు వచ్చి రక్తదాన కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్మధుసూదన్రెడ్డి మంచిర్యాల అధ్యక్షులు లయన్ పి. వెంకటేశ్వర్లు, ప్రోగ్రాం చైర్పర్సన్ లయన్ వి. మధుసూదన్సూదన్ రెడ్డి, లయన్ సభ్యులు లయన్ వినయ్ కుమార్, నాగేందర్, ఏకలవ్య ఆశ్రమ నిర్వాహకులు శ్రీనివాస్, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.












