మంచిర్యాల జిల్లా కేంద్రంలోని నస్పూర్ గేటు వద్ద సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద వార్త తెలుసుకున్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి వెంటనే స్పందించారు.
లారీ ఆటోను ఢీకొన్న ఈ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున, గాయపడిన వారికి రూ.10 వేల చొప్పున తక్షణ సహాయం ప్రకటించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. క్షతగాత్రుల ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.












