ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర బీజేపీ ఎస్సీ మోర్చా అధికార ప్రతినిధి శైలందర్ వాగ్మారె రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి నిధులు విడుదల చేయాలని ఆయన కోరారు.
ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర బీజేపీ ఎస్సీ మోర్చా అధికార ప్రతినిధి శైలందర్ వాగ్మారె రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు విడుదల చేసి ఎస్సీ వర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయాలని ఆయన అన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు పతంగే బ్రహ్మానంద్ మాట్లాడుతూ ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ నిధుల విడుదలలో జాప్యం జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో, పెద్ద ఎత్తున జిల్లా ఈడీ కార్యాలయాన్ని బీజేపీ నాయకులు, కార్యకర్తలు ముట్టడించారు. నిధుల విడుదల డిమాండ్‌తో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.












