మండల పరిధిలోని బుదేరా చౌరస్తాలో గురువారం మండల అక్రిడేషన్ కార్డు ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఈ ఎన్నికలో బండారి లక్ష్మణ్ అధ్యక్షుడిగా, థామస్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు.
మండల పరిధిలోని బుదేరా చౌరస్తాలో గురువారం మండల అక్రిడేషన్ కార్డు ప్రెస్ క్లబ్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడిగా బండారి లక్ష్మణ్, ఉపాధ్యక్షుడిగా ఇర్ఫాన్, ప్రధాన కార్యదర్శిగా థామస్, జాయింట్ సెక్రెటరీగా అబ్దుల్ రహీం, సలహాదారుగా చోటు మియా, ట్రెజరర్ గా తాటిపల్లి మల్లేశం ఎన్నికయ్యారు. కమిటీలో సభ్యులుగా భుజంగం, ఆంజనేయులు, అహ్మద్, శ్రీనివాస్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నిక ప్రక్రియలో మండలంలోని పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన మండల అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల కోసం తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. అలాగే తమ ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.











