ప్రపంచ దృష్టి దినోత్సవం పురస్కరించుకొని మంచిర్యాలలో ఉచిత కంటి వైద్య నిర్ధారణ శిబిరం నిర్వహించబడుతుంది. లైన్స్ క్లబ్ మంచిర్యాల ఆధ్వర్యంలో చున్నం బట్టేవాడలోని లైన్స్ భవన్ ప్రాంగణంలో ఈ శిబిరం జరుగుతుంది. 50 ఏళ్లు పైబడిన వారికి, తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి కంటి పరీక్షలు చేసి, అవసరమైన వారికి ఉచిత శస్త్రచికిత్సలు అందిస్తారు.
ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా లైన్స్ క్లబ్ మంచిర్యాల ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య నిర్ధారణ శిబిరం నిర్వహించబడుతుంది. పట్టణంలోని చున్నం బట్టేవాడలో ఉన్న లైన్స్ భవన్ ప్రాంగణంలో ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు ఈ శిబిరం జరుగుతుంది.
ఈ కార్యక్రమ ప్రోగ్రాం కోఆర్డినేటర్ లయన్ వి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, మంచిర్యాల పట్టణం జిల్లాలోని 50 సంవత్సరాలు పైబడిన వారు, తెల్ల రేషన్ కార్డు కలిగినవారు, కంటి జబ్బులు, కంటి పొరలు, శుక్లాలతో ఇబ్బంది పడుతున్నవారు ఈ శిబిరంలో పాల్గొనాలని కోరారు. శిబిరంలో మంచిర్యాల పట్టణ ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు లయన్ డాక్టర్ అభిషేక్ చేత అన్ని పరీక్షలు నిర్వహించబడతాయి.
కంటి శాస్త్ర చికిత్సలకు ఎంపికైన వారికి లైన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్లోని రేకుర్తి ఐ హాస్పిటల్లో అన్ని వసతులు ఉచితంగా సమకూర్చి, ఉచిత కంటి శాస్త్ర చికిత్సలు నిర్వహించి, మరుసటి రోజు వారి స్వస్థలాలకు చేరవేస్తారు అని తెలియజేశారు. ఈ సదవకాశాన్ని ప్రజలు సద్వినియోగపరుచుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ వైద్య శిబిరాన్ని పురస్కరించుకొని కరపత్రాలను కూడా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ మంచిర్యాల అధ్యక్షులు లయన్ పి వెంకటేశ్వర్లు, కోశాధికారి లయన్ ఏ వెంకటేశ్వరరావు, ప్రోగ్రాం కోఆర్డినేటర్స్ లయన్ వి మధుసూదన్ రెడ్డి, లయన్ డాక్టర్ కే సుగుణాకర్ రెడ్డి, లయన్ ఎం వెంకటేశ్వర్లు, సీనియర్ లయన్ మెంబర్స్ లయన్ సిరిపురం శ్రీనివాస్, లయన్ గుండా శ్రీనివాస్, లయన్ ఏ రాజేశ్వరరావు, లయన్ బేగా బాపు పాల్గొన్నారు.











