మండలం వైజాపూర్ గ్రామంలో జై దేవి మెడికల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, మాజీ ఎంపీ సోయం బాపూరావు, రీత్విక్ సాయి కోటే ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
వైజాపూర్ గ్రామంలో మదన్ గిత్తే నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరాన్ని ప్రముఖులు సందర్శించి, కార్యక్రమ నిర్వాహకులను అభినందించారు. ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించడం అభినందనీయమని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మడావి సీతబాయి, దౌలత్ రావు, అనసూయ మోహితే, మారుతీ, జైపాల్ తో పాటు పలువురు స్థానిక నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. జై దేవి మెడికల్ ద్వారా నిర్వహించబడిన ఈ శిబిరంలో పలు రకాల వ్యాధులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను పంపిణీ చేశారు. గ్రామీణ ప్రజలకు ఇటువంటి వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.












