ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా మంచిర్యాలలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని లైన్స్ క్లబ్ నిర్వహిస్తోంది. పట్టణంలోని లైన్స్ భవన్ ప్రాంగణంలో గురువారం ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఈ శిబిరం జరగనుంది. ఈ శిబిరంలో కంటి సమస్యలు ఉన్నవారికి ఉచితంగా పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి కరీంనగర్లోని రేకుర్తి ఐ హాస్పిటల్లో ఉచిత శస్త్రచికిత్సలు అందిస్తారు.
ప్రపంచ దృష్టి దినోత్సవం ( ) సందర్భంగా లైన్స్ క్లబ్ మంచిర్యాల ఆధ్వర్యంలో గురువారం ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పట్టణంలోని సున్నం బట్టి వాడలో ఉన్న లైన్స్ భవన్ ప్రాంగణంలో ఉచిత కంటి శాస్త్ర చికిత్స నిర్ధారణ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ శిబిరంలో 50 ఏళ్లు పైబడిన తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు, కంటి జబ్బులతో బాధపడుతున్నవారు, కళ్లలో శుక్లాలు లేదా పొరలు వచ్చినవారు పాల్గొంటే, వారిని మంచిర్యాల పట్టణ ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు లయన్ డాక్టర్ అభిషేక్ పరీక్షిస్తారు.
కంటి శాస్త్ర చికిత్సకు ఎంపికైన వారికి లయన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్లోని రేకుర్తి ఐ హాస్పిటల్లో ఈ నెల మంగళవారం ఉచితంగా అన్ని వసతులు కల్పిస్తూ చికిత్సలు నిర్వహించి, మరుసటి రోజు మంచిర్యాలలో వారి స్వస్థలాలకు చేర్చే కార్యక్రమాన్ని నిర్వహిస్తారని తెలిపారు. కావున మంచిర్యాల పట్టణ, పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రోగ్రాం కోఆర్డినేటర్ లయన్ వి. మధుసూదన్ రెడ్డి తెలిపారు.
ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య జిల్లా ఆరోగ్య వైద్య శాఖ అధికారి () శ్రీ నరేంద్ర రాథోడ్, పట్టణ ప్రముఖ సీనియర్ వైద్య నిపుణులు లయన్ డాక్టర్ సిహెచ్ నరసయ్య, లైన్స్ ఇంటర్నేషనల్ డిస్టిక్ 320 ఉప గవర్నర్గా ఎన్నికైన లయన్ ఉదాహరిచంద్ర మోహన్ గౌడ్ ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొంటారని తెలిపారు.
ఈరోజు కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ మంచిర్యాల అధ్యక్షులు లయన్ పి. వెంకటేశ్వర్లు, సీనియర్ లయన












