సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సముదాయంలో జిల్లా బీసీ శాఖ అధికారి జగదీశ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు బీసీ సంఘాల నాయకులు, బీసీ ఉద్యమ నాయకులు ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
జగదీశ్ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా బీసీ యువత అధ్యక్షుడు గోరుగంటి రమేష్ కుమార్, సంగారెడ్డి బీసీ విద్యార్థి సంఘం నాయకుడు జగదీశ్, సంగారెడ్డి నియోజకవర్గ బీసీ అధ్యక్షుడు లాడే బాలు, గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఆశన్న గౌడ్, ప్రధాన కార్యదర్శి రమేష్తో పాటు వివిధ బీసీ కుల సంఘాల నాయకులు, జిల్లా నాయకులు, బీసీ ఉద్యమ నాయకులు పాల్గొన్నారు.












