మంచిర్యాలలో ఈ నెల 25న ముదిరాజుల సింహగర్జన సభను నిర్వహించనున్నట్లు సంఘం నాయకులు తెలిపారు. జాతి ప్రయోజనాలే ముఖ్యమని, బీసీ డీ నుండి బీసీ ఏలోకి మార్పుతో సాధికారత దిశగా ఈ సభ జరుగుతుందని వారు పేర్కొన్నారు. మత్స్య శాఖలో హక్కుల సాధన, రాజకీయ చైతన్యం వంటి అంశాలపై ఈ సభ దృష్టి సారిస్తుంది.
మంచిర్యాలలో ఈ నెల 25న ముదిరాజుల సింహగర్జన సభ నిర్వహించనున్నట్లు ముదిరాజు సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి గరిగంటి కొమురయ్య సాధన బోయిన కృష్ణ, రాష్ట్ర కార్యదర్శి లు దబ్బెట తిరుపతి, తొండ బోయిన శ్రీకాంత్, కంకణాల సతీష్, పిట్టల తిరుపతి, రాష్ట్ర యువత నాయకులు గరికే సుమన్, పట్టణ అధ్యక్షులు భూతపల్లి రాజేశం లు తెలిపారు. పిలిస్తే కాదు, తెలిస్తే కదిలి రావాలని, జాతి ప్రయోజనాలే ముఖ్యమని, సంఘాలతో సంబంధం లేదని వారు స్పష్టం చేశారు. ముదిరాజుల అభ్యున్నతి, సాధికారత దిశగా ఈ సభ నిర్వహించబడుతుందని పేర్కొన్నారు. మత్స్య శాఖలో హక్కుల సాధనతో పాటు, రాష్ట్రంలో 40 లక్షలు కుటుంబాలు 14 శాతం ఓట్ల చైతన్య రాజకీయ అవగాహనపై ఈ సింహగర్జన జరుగుతుందని తెలిపారు. పలువురు వక్తలు ఈ సందర్భంగా ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిన బాధ్యత ప్రతి ముదిరాజు సైనికుడిపై ఉందని వారు కోరుతున్నారు. ముఖ్యంగా పండ్ల తోటల నిర్వహణ, కౌలు రైతుల ఇబ్బందులు, జాతి ఎదుర్కొంటున్న విద్య, వైద్యం, సొంత ఇంటి కల వంటి అంశాలపై నేతల ప్రసంగం సాగనుంది. మంచిర్యాల జిల్లాలోని ముదిరాజులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నారు. మంచిర్యాల అసెంబ్లీ పరిధిలో 10వేల , చెన్నూరులో 30 వేల బెల్లంపల్లిలో 9వేల కుటుంబాలకు సింహగర్జన ఆహ్వానం పలుకుతోంది. ఈ కార్యక్రమం విజయవంతమైతే జాతి హక్కుల సాధన దిశగా ప్రయాణం ఉంటుందని, ముఖ్యంగా బీసీ డీ నుండి బీసీ ఏలోకి మార్పుతో యువతకు ఉద్యోగ, ఉపాధి, ఆర్థిక పెంపు వంటి పలు కార్యక్రమాలపై సభలో వేదికపై ప్రసంగం ఉంటుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సినీ పిలుపునిస్తున్నారు.












