గర్భస్థ పూర్వ, గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలను నిషేధించే పీసీపీఎన్డీటీ () చట్టాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని అడిషనల్ కలెక్టర్ పాండు అధికారులను ఆదేశించారు. లింగ నిర్ధారణ పరీక్షలకు పాల్పడే స్కానింగ్ కేంద్రాలపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. బుధవారం జరిగిన జిల్లా స్థాయి అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి.
గర్భస్థ పూర్వ, గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలను నిషేధించే పీసీపీఎన్డీటీ () చట్టాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని అడిషనల్ కలెక్టర్ పాండు అధికారులను ఆదేశించారు. లింగ నిర్ధారణ పరీక్షలకు పాల్పడే స్కానింగ్ కేంద్రాలపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. బుధవారం అడిషనల్ కలెక్టర్ ఛాంబర్లో గర్భస్థ పూర్వ, గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ జిల్లా స్థాయి అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలోని స్కానింగ్ కేంద్రాల రిజిస్ట్రేషన్, రెన్యువల్, రికార్డుల నిర్వహణ, చట్టం అమలు, ప్రజల్లో అవగాహన కల్పించే అంశాలపై సమీక్షించారు. అడిషనల్ కలెక్టర్ పాండు మాట్లాడుతూ, జిల్లాలో స్కానింగ్ కేంద్రాల రిజిస్ట్రేషన్, రెన్యువల్ సమయంలో అన్ని నిబంధనలు, నిర్దేశిత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అర్హతలు, అవసరమైన అనుమతులు కలిగి, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించబడుతున్న స్కానింగ్ కేంద్రాలకు మాత్రమే రిజిస్ట్రేషన్, రెన్యువల్ చేయాలని అధికారులను ఆదేశించారు.
ఏ స్కానింగ్ కేంద్రంలోనైనా గర్భిణీ స్త్రీలకు నిర్వహించే స్కానింగ్ ద్వారా పుట్టబోయే శిశువు ఆడా, మగా అనే లింగ నిర్ధారణ చేయడం పూర్తిగా నిషేధమని తెలిపారు. ఎవరైనా లింగ నిర్ధారణ పరీక్షలకు పాల్పడినట్లు గుర్తిస్తే పీసీపీఎన్డీటీ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే స్కానింగ్ కేంద్రాల అనుమతులను రద్దు చేయడంతో పాటు, అవసరమైన సందర్భాల్లో సీజ్ చేసే చర్యలు కూడా చేపట్టాలని ఆయన స్పష్టం చేశారు. లింగ నిర్ధారణ పరీక్షల నివారణ, పీసీపీఎన్డీటీ చట్టం సమర్థవంతమైన అమలుకు సంబంధిత అధికారులు సమన్వయంతో పని చేయాలని అడిషనల్ కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో డీఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ లలితాదేవి, డీసీహెచ్ఎస్ శ్రీధర్ కుమార్, జిల్లా స్థాయి అడ్వైజరీ కమిటీ సభ్యులు డా.లక్ష్మి శైలజ, డా.శశికల, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు అడ్వకెట్ శైలజ, డా.రాజుగౌడ్, సంబంధిత వైద్యులు పాల్గొన్నారు.











