భీమారం గ్రామంలోని ఎస్సీ కాలనీ 6వ వార్డు, చౌదరి వాడ 8వ వార్డులలో బోరు మోటార్లు కాలిపోవడంతో ప్రజలు తీవ్ర నీటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమస్యను వెంటనే సర్పంచ్ ఉష్కమల్ల విజయలక్ష్మి దృష్టికి తీసుకురావడంతో, ఆమె స్పందించి మోటార్లను ఇప్పించి నీటి సమస్యను పరిష్కరించారు. ప్రజలు సర్పంచ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
భీమారం గ్రామంలోని ఎస్సీ కాలనీ 6వ వార్డులో, చౌదరి వాడ 8వ వార్డులో బోరు మోటార్లు కాలిపోవడంతో ప్రజలు తీవ్ర నీటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యను వెంటనే గ్రామ సర్పంచ్ ఉష్కమల్ల విజయలక్ష్మి దృష్టికి తీసుకురావడంతో, ఆమె వెంటనే స్పందించి మోటార్లను ఇప్పించి, నీటి సమస్య లేకుండా చేశారు. ప్రజలు సర్పంచ్‌కు ధన్యవాదాలు తెలిపారు. వారు చాలా సంతోషంగా ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, ఎల్వినోవా సమస్య ప్రపంచవ్యాప్తంగా ఉంది. వర్షాలు చాలా తక్కువగా కురిశాయి. ఏ ఒక్క చెరువు లేదా ప్రాజెక్టు నీటితో నిండలేదు. కాబట్టి, కరెంటు, నీటి సమస్యలు ముందు ముందు ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, కరెంటు, నీటిని చాలా పొదుపుగా వాడుకోవాలి అని సూచించారు. గ్రామ పంచాయతీ మోటార్లను మన ఇంటి మోటార్ల వలె జాగ్రత్తగా చూసుకోవాలని ఆమె సూచించారు. భీమారం ఎస్సీ, ఎస్టీ వాడలకు, కాలనీలకు వెళ్లే రోడ్డు మొత్తం గుంతలతో, పెద్ద పెద్ద రంధ్రాలతో ఉండటం వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని వార్డు సభ్యులు సర్పంచ్ దృష్టికి తీసుకువెళ్లారు. ఆమె వెంటనే స్పందించి, ఆ ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించి, వర్షాలు తగ్గిన వెంటనే ప్యాచ్ వర్క్ చేపడతామని హామీ ఇచ్చారు. ఈరోజు సర్పంచ్ ఉష్కమల్ల విజయలక్ష్మి, పున్నం చందు ప్యాచ్ వర్క్‌కు సంబంధించిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. భీమారం గ్రామంలో ఎక్కడెక్కడ పెద్ద పెద్ద రంధ్రాలు ఉన్నాయో అక్కడల్లా ఈ ప్యాచ్ వర్క్ చేయాలని కాంట్రాక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. భీమారం లో బతుకమ్మ ఆడుకునే స్థలాలను సందర్శించి, మొరం లేని చోట మొరం పోసి, శుభ్రం చేయిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ మల్లేష్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోడేటి రవి, ఎస్సీ సెల్ అధ్యక్షులు ప్రకాష్, మాజీ జెడ్పిటిసి రాజకుమార్ నాయక్, కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ అశోక్, కాంగ్రెస్ నాయకులు ఉష్కమల్ల శ్రీనివాస్, గుండు తిరుపతి, వివిధ వార్డు సభ్యులు పాల్గొని విజయవంతం చేశారు.


