మండల కోయ సంఘం నూతన కమిటీ సభ్యులను ఆదివారం అంబేద్కర్ భవనంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో ఆత్రం సమ్మయ్య మండల అధ్యక్షులుగా, అలం భానేష్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. పలువురు ఉపాధ్యక్షులు, జాయింట్ సెక్రటరీలు, కార్యనిర్వహణ సభ్యులు కూడా ఎన్నికయ్యారు.
ఆదివారం అంబేద్కర్ భవనంలో మండల కోయ సంఘం కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షులుగా ఆత్రం సమ్మయ్య, ప్రధాన కార్యదర్శిగా అలం భానేష్, ఉపాధ్యక్షులుగా కోరితే సమ్మయ్య, ఎలాది సంతోష్, అర్ష మల్లేశ్, కొడపె బాను, మడె వసంత్, తొర్రం శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీలుగా సేడంక రవి, చిడం గడ్డి మల్లయ్య, అర్కం బాపు, గావిడి సుజాత, కోడిపె స్వామి, కోశాధికారిగా కోరితే శంకర్, ప్రచార కార్యదర్శిగా గావిడి సమ్మయ్య, కార్యనిర్వహణ సభ్యులుగా ఆత్రం బాపు, గావిడి భానేష్, అలం బానయ్య, చిడం తిరుపతి, కోడిపె లక్ష్మీలను ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల కార్యక్రమంలో ఆదివాసీ కోయ సంఘం గౌరవ అధ్యక్షులు నైతం లక్ష్మణ్, జిల్లా అధ్యక్షుడు సెడంక మంతయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి మడె సమ్మయ్య, ఉపాధ్యక్షులు అలం బాపు, జాయింట్ సెక్రటరీ అర్క రాజారామ్, జిల్లా కమిటీ సభ్యులు, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, వివిధ మండల కమిటీ సభ్యులు, కుల సంఘాల నాయకులు, మహిళలు పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు జిల్లా అధ్యక్షుడు సెడంక మంతయ్య నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తామని తెలిపారు.










