తెలంగాణలో నామినేటెడ్ పదవుల భర్తీకి కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు చేస్తోంది. దసరా పండుగ సందర్భంగా దాదాపు 60 కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్ల నియామకం జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే అర్హులైన నేతల జాబితాపై ప్రాథమిక కసరత్తు పూర్తయినట్లు తెలుస్తోంది.
దసరా పండుగను పురస్కరించుకుని నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తారనే ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో ఊపందుకున్నది. ఎవరెవరికి ఏ పదవులు ఇవ్వాలనే అంశంపై ఇప్పటికే ప్రాథమిక కసరత్తు పూర్తి అయినట్టు తెలుస్తున్నది. పార్టీ ఇన్చార్జిగా ఉన్న మీనాక్షి నటరాజన్ విదేశీ పర్యటనలకు వెళ్లడంతో ఆ స్థానంలో కొత్త వారిని నియమించలేదు. దీనితో నామినేటెడ్ పదవుల భర్తీపై ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్‌తో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తే పండుగ సందర్భంగా నామినేటెడ్ పదవుల భర్తీ జరుగనుంది.
జంబో నియామకాలు
మరో రెండేళ్లలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో పార్టీ నేతలను ఇప్పటి నుంచి యాక్టివ్ ఉంచేందుకు నామినేటెడ్ పదవులను భర్తీ చేయాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నది. పదవులు పొందిన నేతలను పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసేవిధంగా క్యాలెండర్ తయారు చేస్తున్నది. అందుకోసం ఒకేసారి దాదాపు 60 కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లను నియమించనున్నట్టు తెలిసింది. దీనితో సుమారు 200 మందికి పదవులు దక్కనున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఇప్పటికే అర్హులైన నేతల పేర్లపై సీఎం దేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ప్రాథమిక కసరత్తు పూర్తి చేశారు. అధిష్టానం నుంచి ఆమోదం లభించాక ప్రకటించనున్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత 2024 జులైలో పలు నామినేటెడ్ పదవులను ప్రభుత్వం భర్తీ చేసింది. పదవీ కాలం రెండేళ్ళే కావడంతో ఈ ఏడాది జులైలో ముగిసింది. కాగా, మరోసారి అవకాశం ఇస్తారనే ధీమాతో మెజారిటీ మంది తమకు కేటాయించిన అఫీసులను ఖాళీ చేయలేదు. అడపాదడపా మిగతా 07లో..












