సదాశివపేట పట్టణంలోని చాపలకేరి శ్రీ మహంకాళి మందిరంలో దేవి నవరాత్రుల సందర్భంగా 12వ వార్డు కౌన్సిలర్ పులిమామిడి మమత రాజు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం కూడా చేశారు. ఆలయంలో మహంకాళి మాత అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చింది.
కౌన్సిలర్ పులిమామిడి మమత రాజు దంపతులు అమ్మవారికి ప్రత్యేక అభిషేకం, అలంకరణ, కుంకుమార్చన కార్యక్రమాలను నిర్వహించారు. అర్చకులు రాకేష్ పంతులు ఆధ్వర్యంలో వేదమంత్రోచ్ఛారణల నడుమ పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో కొనసాగాయి. కుంకుమార్చనలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.
ఈ సందర్భంగా పులిమామిడి రాజు మాట్లాడుతూ, దేశంలో వర్షాలు సకాలంలో కురవక, నీటి కొరతతో పాడిపంటలు ఎండిపోతున్నాయని, తాగునీరు కూడా తగ్గిపోతోందని, కావున అమ్మవారు దేశ ప్రజలను సుభిక్షంగా ఉంచి, వర్షాలు కురిపించి, కరువు నుంచి కాపాడాలని అమ్మవారిని వేడుకున్నారు.
ఈ కార్యక్రమంలో 11వ వార్డు కౌన్సిలర్ వైద్యం గోపి ప్రియాంక పవన్, శ్రీ మహంకాళి దేవాలయ అధ్యక్షులు నల్ల సుధాకర్, ప్రధాన కార్యదర్శి నల్ల శంకర్, కార్యవర్గ సభ్యులు చాపల హన్మంతు, జనార్ధన్, బంటు రవి, పద్మ మాణిక్యం, సాతాని నరేందర్, మహేష్, అఖిల్, నాగరాజు, రాగం అనిల్, తాలెల్మ రాము, సోమ శంకర్ తదితరులతో పాటు మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.












