సంగారెడ్డి పట్టణంలోని మహబూబ్ సాగర్ చెరువు కట్టపై బతుకమ్మ వేడుకల ఏర్పాట్లను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత్ కిషన్ పరిశీలించారు. విద్యుద్దీపాలంకరణ, బారికేడ్ల పనుల పురోగతిని వారు అడిగి తెలుసుకున్నారు. ఈసారి బతుకమ్మల నిమజ్జనం కోసం రెండు ఘాట్లను సిద్ధం చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
సంగారెడ్డి పట్టణంలోని మహబూబ్ సాగర్ చెరువు కట్టపై బతుకమ్మ వేడుకల ఏర్పాట్లను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత్ కిషన్ పరిశీలించారు. కట్ట పొడవునా చేపడుతున్న విద్యుద్దీపాలంకరణ, కట్ట అంచుల్లో బారికేడ్ల ఏర్పాటు పనుల పురోగతిని వారు అడిగి తెలుసుకున్నారు. బతుకమ్మ ఘాట్లను సందర్శించి అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈసారి బతుకమ్మల నిమజ్జనం కోసం రెండు ఘాట్లను సిద్ధం చేస్తున్నామని, మెట్లకు రంగులు వేస్తున్నామని నిర్వాహకులు వివరించారు. గతంలో జరిగిన వినాయక నిమజ్జనానికి సంబంధించిన అవశేషాలను పూర్తిగా తొలగించినట్లు మున్సిపల్ సిబ్బంది తెలిపారు. వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా 32 అడుగుల భారీ బతుకమ్మను ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ భారీ బతుకమ్మ తయారీకి 16 టన్నుల స్టీల్, అలంకరణకు ఎనిమిది టన్నుల పూలను వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఐదు డీజే పాయింట్లు, ఘాట్ల వద్ద ఐదు లైటింగ్ టవర్లతో సహా మొత్తం 18 లైటింగ్ టవర్లను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. అలాగే 32 అడుగుల స్క్రీన్, లేజర్ లైటింగ్తో పాటు చెరువు కట్ట చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత్ కిషన్, నాయకులు బొంగుల రవి, కూన సంతోష్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కిరణ్ గౌడ్, కౌన్సిలర్ శ్రీకాంత్ గౌడ్, మహేష్ ముదిరాజ్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. మండలం రేజింతల్ గ్రామంలో నూతనంగా నిర్మించిన బతుకమ్మ ఘాట్ను గురువారం నిర్మలా జగ్గారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిద్ధన్న, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్, సర్పంచ్ గడీల ఆశిరెడ్డి, నందికంది సర్పంచ్ విజయ్ భాస్కర్ రెడ్డి, రేజింతల్ సర్పంచ్ అనితా శ్రీనివాస్, మండల నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.












