రాష్ట్ర మంత్రి వివేక్ వెంకట్ స్వామి అండతోనే అటవీ అధికారులు గిరిజనులపై పాశవిక దాడులకు పాల్పడుతున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర గౌడ్ ఆరోపించారు. , ఆల్గాం గ్రామాల్లో దసలి పంట సాగు చేస్తున్న రైతులు, మేకలు మేపుతున్న గిరిజనులపై జరిగిన దాడులను ఆయన ఖండించారు.
మండలం కావర్ కొత్తపల్లిలో దసలి పంట సాగు చేస్తున్న రైతుపై అటవీ అధికారులు ఇటీవల దాడి చేసి చితకబాదడంతో గాయపడిన ఆదివాసి రైతును, ఆల్గాం గ్రామంలో ఇటీవల అటవీ అధికారులు మేకలు మేపుతున్న గిరిజనులను కూడా చూడకుండా చితకబాదిన సంఘటనలో గాయపడ్డ బాధితులను భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దుర్గం అశోక్ తో కలిసి బిజెపి జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర గౌడ్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 8 దశాబ్దాలుగా చెన్నూరు కేంద్రంగా అటవీ ప్రాంతంలో దసలి పంట సాగు జరుగుతోందని, దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ టస్సర్ కార్యాలయాల పర్యవేక్షణ ఉందని తెలిపారు. టస్సర్ కార్యాలయంలోనే రైతులు పంటను విక్రయిస్తున్నారని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా వచ్చిన అటవీ అధికారులు సుమారు 500 మంది ఆదివాసి రైతులను దసలి పంట సాగు చేయకుండా అడ్డుకోవడమే కాకుండా భౌతిక దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అటవీ అధికారులు దాడికి గురైన రైతు వెంట ఆసుపత్రికి వెళ్ళినందుకు కక్ష సాధింపుగా పదిమంది రైతుల పంటను అటవీ అధికారులు ధ్వంసం చేశారని ఆయన ఆరోపించారు. ఇలాంటి పాశవిక దాడులు చేస్తున్న వారిపై కేసులు నమోదు చేయకుండా, వారికి ఈ రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి వివేక్ వెంకట్ స్వామి గారు బాసటగా నిలవడం శోచనీయమని ఆయన అన్నారు.
ఇటీవల ఆల్గాం గ్రామం పరిధిలో అడవిలో మేకలను మేపుతున్న ఒక గిరిజన రైతుపై, ఒక గొర్రెల కాపరిపై అటవీ అధికారులు పాశవికంగా దాడి చేశారని, ఈ సంఘటనలో కేసు నమోదు చేయకుండా అటవీ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడికి గురైన వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇదెక్కడి ప్రజాస్వామ్యం అని ఆయన ప్రశ్నించారు. మంత్రి వివేక్ వెంకట్ స్వామి గారికి చిత్తశుద్ధి ఉంటే, తక్షణం రెండు సంఘటనల్లో బాధ్యులైన ప్రభుత్వ అధికారులపై సుమోటోగా కేసులు నమోదు చేసి, వారిని తక్షణం విధుల నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు స్వప్న పున్నం చంద్, భాజపా జిల్లా కార్యదర్శి మంత్రి సురేఖ రామయ్య, బీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు పెద్దింటి లక్ష్మణ్, గిరిజన మోర్చా నాయకులు ఆలం బాపు, చాకేటి శ్యామ్, బిజెపి సీనియర్ నాయకులు కాసెట్టి నాగేశ్వరరావు, మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.












