మంచిర్యాల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నసూర్ విభాగానికి చెందిన 131 మంది కార్మికులకు ఐదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న సుమారు రెండు కోట్ల రూపాయల పీఎఫ్ బ్యాలెన్స్‌ను అధికారులు విడుదల చేశారు. ఈ మొత్తాన్ని వ తేదీన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు చేతుల మీదుగా కార్మికులకు అందజేశారు.
ఈ నెల 20వ తేదీన కార్మికుల ఖాతాల్లో లక్షకు పైగా పీఎఫ్ బ్యాలెన్స్ జమ అయింది. ఈ నేపథ్యంలో, కార్మికులు తమకు న్యాయం చేసిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ పీఎఫ్ బకాయిల చెల్లింపు ప్రక్రియలో కీలక పాత్ర పోషించిన మేయర్, డిప్యూటీ మేయర్, కమిషనర్, డిప్యూటీ కమిషనర్, శానిటరీ ఇన్స్పెక్టర్లకు కార్మికులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మంచిర్యాల్ మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు, 11వ డివిజన్ కార్పొరేటర్ సుధమల్ల హరికృష్ణ చేసిన కృషికి కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు. ఆయనను శాలువాతో సత్కరించారు. సంఘం అధ్యక్షులు కొయ్యల వెంకటి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.



