భీమారం గ్రామపంచాయతీ పరిధిలోని ఐదవ వార్డులో మోటార్ కాలిపోవడంతో నీటి సరఫరా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలియడంతో, సర్పంచ్ ఉష్కమల్ల విజయలక్ష్మి చొరవ తీసుకున్నారు. వార్డు సభ్యురాలు అనూష, దాసరి ప్రకాష్, గడ్డం లచ్చన్న లతో పాటు వార్డు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను సర్పంచ్‌కు వివరించారు.
ఈ నేపథ్యంలో, సర్పంచ్ ఉష్కమల్ల విజయలక్ష్మి, పున్నం చంద్ లతో కలిసి వార్డు ప్రజలకు అవసరమైన మోటార్ స్టార్టర్ ను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా, ప్రజలకు నీటిని వృధా చేయకుండా, విద్యుత్తును పొదుపుగా వాడుకోవాలని సూచనలు చేశారు. మోటార్ ను ఎంత అవసరమో అంతే వాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సెక్రటరీ మల్లేష్, ఉస్కామల్ల మల్ల శ్రీనివాస్, వార్డు సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు. వార్డు సభ్యులు, ప్రజలు సర్పంచ్‌కు సంతోషంతో స్వీట్లు అందించి, ధన్యవాదాలు తెలియజేశారు.


