పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న రైల్వే సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎంపీ గడ్డం వంశీకృష్ణ కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామితో కలిసి ఆయన కేంద్ర మంత్రికి వినతిపత్రం అందజేశారు.
రూ.1,000 కోట్లతో మంజూరైన 16 రైల్వే ఓవర్ బ్రిడ్జి () పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, , పెద్దపల్లి రైల్వే స్టేషన్లలో అదనపు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు స్టాపేజీలు కల్పించాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు. జిల్లాలో రైల్వే అండర్ బ్రిడ్జిలు (లు), సబ్‌వేలు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు.
మూడు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న మంథని రైల్వే కనెక్టివిటీ సమస్యను ప్రస్తావిస్తూ, 207.8 కిలోమీటర్ల రామగుండంమణుగూరు రైల్వే లైన్ పనులను తక్షణమే ప్రారంభించాలని ఎంపీ వంశీకృష్ణ డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టుతో మంథని ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆయన పేర్కొన్నారు.
పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సమాన ప్రాధాన్యతతో రైల్వే అభివృద్ధి పనులు చేపట్టాలని, పెండింగ్ ప్రాజెక్టులకు నిర్దిష్ట గడువు ప్రకటించాలని ఎంపీ వంశీకృష్ణ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.












