ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా మారిన ఓట్ల చోరీని కాంగ్రెస్ సహించబోదని, బీజేపీ ప్రభుత్వంపై రాజకీయ యుద్ధం ప్రకటిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే 13 కోట్ల ఓట్ల తస్కరణ జరిగిందని ఆరోపిస్తూ, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పోరాటం కొనసాగిస్తుందని ఆయన హెచ్చరించారు.

రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పిలుపు మేరకు రాంలీలా మైదానంలో నిర్వహించిన నిరసన కార్యక్రమానికి తెలంగాణ నుంచి భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉత్సాహం నింపారు.
తెలంగాణ భవన్ నుంచి ర్యాలీగా బయలుదేరి సభకు చేరుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఓట్ల అక్రమాలపై మోదీ ప్రభుత్వాన్ని నిలదీస్తామని, రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ మరింత బలంగా పోరాడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.