మంచిర్యాల (అక్షరవేకువ) నవంబర్ 12
మంచిర్యాల జిల్లా కేంద్రంలో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టి.యు.డబ్ల్యూ.జె) జిల్లా మహాసభ, నూతన జిల్లా కార్యవర్గ ఎన్నికలు నిర్వహించనున్నారు. పట్టణంలోని ఫైర్ స్టేషన్ ఎదురుగా ఉన్న ఎం కన్వెన్షన్ హాల్లో శుక్రవారం ఉదయం 11 గంటలకు మహాసభ ప్రారంభం కానుంది.
మంచిర్యాల జిల్లా కేంద్రంలో నేడు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టి.యు.డబ్ల్యూ.జె) జిల్లా మహాసభ, నూతన జిల్లా కార్యవర్గ ఎన్నికలు నిర్వహించనున్నారు. పట్టణంలోని ఫైర్ స్టేషన్ ఎదురుగా ఉన్న ఎం కన్వెన్షన్ హాల్లో శుక్రవారం ఉదయం 11 గంటలకు మహాసభ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి టి.యు.డబ్ల్యూ.జె రాష్ట్ర అధ్యక్షుడు విరాట్ అలీ, జనరల్ సెక్రటరీ రాంనారాయణ, ఐ. జె,యూ. కార్యవర్గ సభ్యులు నగునూరి శేఖర్, వంశీతో పాటు రాష్ట్ర కార్యవర్గానికి చెందిన సుమారు 30 మంది నేతలు హాజరుకానున్నారు.
మహాసభ మధ్యాహ్నం 1 గంటల వరకు కొనసాగనుంది. అనంతరం ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఎన్నికల ఫలితాలను వెంటనే ప్రకటించనున్నట్లు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రూపురెడ్డి ప్రకాశ్ రెడ్డి తెలిపారు. జిల్లాలోని టి.యు.డబ్ల్యూ.జె సభ్యులంతా పెద్ద సంఖ్యలో హాజరై మహాసభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.


