భీమారం, 17 November
మండల కేంద్రంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, గ్రామీణ స్వయం ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న 14 రోజుల ఉచిత జ్యూట్ బ్యాగ్స్ శిక్షణా కేంద్రాన్ని రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి ఈరోజు సందర్శించారు. మహిళలు తయారు చేసిన జ్యూట్ బ్యాగులను ఆయన పరిశీలించారు.
మండల కేంద్రంలోని గ్రామపంచాయతీలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, గ్రామీణ స్వయం ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో 14 రోజుల ఉచిత జ్యూట్ బ్యాగ్స్ శిక్షణా కేంద్రాన్ని రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి ఈరోజు సందర్శించారు. 8 రోజుల శిక్షణా కాలంలో మహిళలు నేర్చుకొని తయారు చేసిన జ్యూట్ బ్యాగులను, మంత్రి వారు తయారు చేసిన అన్ని మోడల్ బ్యాగులను చూపించారు. మంచి శిక్షణతో ఈ బ్యాగులను ఎక్కువగా ఉత్పత్తి చేయడం ద్వారా ప్లాస్టిక్‌ను నివారించవచ్చని, మహిళలకు ఉపాధి కూడా లభిస్తుందని మంత్రి తెలిపారు. అలాగే, లో ఈ జ్యూట్ బ్యాగ్స్ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి కృషి చేసి, మహిళలను ప్రోత్సహించడం మంచిదని సర్పంచ్ ఉస్కామల్ల విజయలక్ష్మి, పున్నం చందు అభినందించారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ఉచిత భోజనం అందించి, శిక్షణ ఏర్పాటు చేసినందుకు వారిని కూడా అభినందించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి, డైరెక్టర్ ఆశిష్ వాగ్రే, రమాదేవి, ఉపసర్పంచ్ సత్తమ్మ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోడేటి రవి, సెల్ అధ్యక్షులు ప్రకాష్, నాయకులు రాజ్ నాయక్, వార్డ్ సభ్యులు, మహిళలు అందరూ పాల్గొన్నారు.


