గుడిహత్నూర్, 8 November
రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా తొడసం దౌలత్ రావు, నాగనాథ్ అప్పా మోహితే, మారుతీ, సమీర్ ఖాన్, ఆడే జైపాల్, మహేందర్, బాలాజీ, గణపతి, జ్యోతిరామ్ తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన కేక్ ను నాయకులు కట్ చేసి, ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.


