మంచేరియల్, 10 November
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని ఎంపీ గడ్డం వంశీకృష్ణ బీఆర్ఎస్ నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు. జిల్లాలో పర్యటించిన ఆయన స్థానిక గెస్ట్‌హౌస్‌లో కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజల సమస్యలు తెలుసుకున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని ఎంపీ గడ్డం వంశీకృష్ణ బీఆర్ఎస్ నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు. జిల్లాలో పర్యటించిన ఆయన స్థానిక గెస్ట్‌హౌస్‌లో కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలను కలిసి వారి సమస్యలు తెలుసుకుని వినతిపత్రాలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. లక్షల కోట్లు ఖర్చు చేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోవడంతో రైతులకు ఆశించిన ప్రయోజనం కలగలేదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం సక్రమంగా జరిగిందనే నమ్మకం కేసీఆర్, కేటీఆర్‌కు ఉంటే ప్రాజెక్టు దిగువన నిలబడి గేట్లు తెరవాలని బహిరంగ సవాల్ విసిరారు.
ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన కరువు పరిస్థితులను కూడా ప్రస్తావిస్తూ, కాళేశ్వరం బ్యారేజీలో నీళ్లు నిల్వ చేయకపోవడంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తప్పుబట్టారు. ఎన్డీఎస్ఏ భద్రతా సూచనల మేరకే నీళ్లు నిల్వ చేయడం లేదని, మరమ్మతులు పూర్తయ్యే వరకు బ్యారేజీని వినియోగించవద్దన్న సూచనలను పాటించడం ప్రజల భద్రత కోసమేనని స్పష్టం చేశారు.
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చి ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
పార్లమెంట్ పరిధిలో అభివృద్ధి పనులకు ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. తాడిచెర్ల బ్లాక్-2 బొగ్గు కేటాయింపులపై పార్లమెంట్లో పలుమార్లు పోరాటం చేశామని వెల్లడించారు.
త్వరలో రామగిరి ఖిల్లా అభివృద్ధి పనులు ప్రారంభం కానున్నాయని, దీనికి రూ.5 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.



